అమిత్ షాను కలిసింది బీజేపీలో విలీనం కావడానికేగా?: అంబటి రాంబాబు
- నిన్న రాత్రి అమిత్ షాను కలిసిన నారా లోకేశ్
- సమావేశంలో పాల్గొన్న కిషన్ రెడ్డి, పురందేశ్వరి
- ఈ భేటీపై సెటైర్ వేసిన అంబటి రాంబాబు
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో టీడీపీ యువనేత నారా లోకేశ్ కలిసిన సంగతి తెలిసిందే. నిన్న సీఐడీ విచారణ ముగిసిన వెంటనే ఆయన హుటాహుటిన ఢిల్లీకి వెళ్లి నిన్న రాత్రి అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా అక్కడ తెలంగాణ, ఏపీ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి, పురందేశ్వరి కూడా ఉన్నారు. తమపై నమోదైన కేసుల గురించి ఈ సమావేశంలో అమిత్ షాకు లోకేశ్ వివరించారు. ఈ నేపథ్యంలో లోకేశ్ పై మంత్రి అంబటి రాంబాబు సెటైరిక్ గా ట్వీట్ చేశారు. అమిత్ షాను కలిసింది బీజేపీలో విలీనం కావడానికేగా? అని ఎద్దేవా చేశారు.