ఇప్పుడు వెల్లుల్లి వంతు.. కిలో రూ.280 కి చేరిన ధర

  • సప్లై తగ్గడంతో మార్కెట్లో పెరుగుతున్న వెల్లుల్లి రేటు
  • ముంబై హోల్ సేల్ మార్కెట్ లో కిలో రూ.160
  • సప్లై దాదాపు 40 శాతం తగ్గిందని చెబుతున్న వ్యాపారులు
నిన్నటి వరకు మార్కెట్లో ఉల్లి ధరలు పెరగగా.. ఇప్పుడు వెల్లుల్లి వంతు వచ్చినట్లు కనిపిస్తోంది. కిలో రూ. 80 నుంచి రూ.120 మధ్య ఉండే వెల్లుల్లి ధరలు ప్రస్తుతం కొండెక్కాయి. హోల్ సేల్ మార్కెట్లోనే కిలో రూ. 160 కి చేరింది. దీంతో రిటైల్ మార్కెట్లో కిలో రూ.280 దాకా పెరిగింది. మార్కెట్ లోకి సప్లై తగ్గడం వల్లే వెల్లుల్లి ధరలు పెరుగుతున్నాయని, నెల రోజుల్లో ధరలు మళ్లీ సాధారణ స్థాయికి వస్తాయని వ్యాపారులు చెబుతున్నారు.

నవీ ముంబైలోని మార్కెట్ కు నిత్యం 24 నుంచి 30 వాహనాలలో వచ్చే వెల్లుల్లి స్టాకు ప్రస్తుతం తగ్గిపోయిందని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ) వెల్లడించింది. ఇప్పుడు రోజూ 15 ట్రక్కులకు మించి రావడంలేదని చెప్పింది. సప్లై దాదాపు 40 శాతం పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో మార్కెట్లో వెల్లుల్లి ధర పెరుగుతుందని వివరించారు. మే నెల ప్రారంభంలో కిలో వెల్లుల్లి ధర రూ.30 నుంచి రూ.60 వరకు ఉండేదని చెప్పారు.


More Telugu News