లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ మధ్యాహ్నానికి వాయిదా
- స్కిల్ కేసులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ వేసిన లోకేశ్
- విచారణను మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేసిన హైకోర్టు
- లోకేశ్ ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయన్న ఆయన తరపు న్యాయవాది
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ యువనేత నారా లోకేశ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. మధ్యాహ్నం 2.15 గంటలకు తదుపరి విచారణను చేపడతామని తెలిపింది. లోకేశ్ బెయిల్ పిటిషన్ పై ఈ నెల 4న విచారణ జరిగింది. ఆ విచారణను ఈ రోజుకు వాయిదా వేసింది. అయితే తదుపరి విచారణ వరకు లోకేశ్ ను అరెస్ట్ చేయవద్దని సీఐడీ అధికారులను ఆదేశించింది.
మరోవైపు ఈ కేసులో లోకేశ్ పేరును చేర్చలేదని గత విచారణ సందర్భంగా హైకోర్టుకు సీఐడీ తెలిపింది. అయితే చంద్రబాబు కుటుంబ సభ్యులు లబ్ధి పొందినట్టు చంద్రబాబు రిమాండ్ రిపోర్టులో సీఐడీ పేర్కొందని... ఈ నేపథ్యంలో లోకేశ్ ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నందువల్లే తాము బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్టు లోకేశ్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.