రూ. 13 వేలకు అమ్మేసిన మాస్కుకు వేలంలో రూ. 36 కోట్ల ధర.. ఆర్ట్ డీలర్‌పై కోర్టుకెక్కిన వృద్ధ దంపతులు
- ఫ్రాన్స్‌లోని నిమెస్‌లో ఘటన
- ఇల్లు శుభ్రం చేస్తుండగా కనిపించిన మాస్క్
- అసలు ధర దాచిపెట్టి చౌకగా కొట్టేశాడంటూ కోర్టులో దావా వేసిన వృద్ధ దంపతులు
- ఆ మాస్క్ గాబన్‌లోని ఫాంగ్ ప్రజలకు చెందినదిగా గుర్తింపు
- 19వ శతాబ్దంనాటి అత్యంత అరుదైన మాస్క్
తమ నుంచి రూ. 13 వేలకు కొనుగోలు చేసిన మాస్కును వేలంలో ఏకంగా రూ . 36 కోట్లకు అమ్మిన ఓ ఆర్ట్ డీలర్‌పై వృద్ధ దంపతులు కోర్టుకెక్కారు. ‘మెయిల్ ఆన్‌లైన్’ కథనం ప్రకారం.. ఫ్రాన్స్‌లోని నిమెస్‌కు చెందిన 80 ఏళ్ల వయసులో ఉన్న ఫ్రాన్స్‌కు చెందిన వృద్ధ దంపతులు 2021లో ఇంటిని శుభ్రం చేస్తున్నప్పుడు కనిపించిన ‘ఎంగిల్’ ఆఫ్రికన్ మాస్కును అమ్మేయాలని నిర్ణయించుకున్నారు. ఓ ఆర్ట్ డీలర్‌కు దానిని 129 పౌండ్ల (మన కరెన్సీలో 13,208 రూపాయలు)కు విక్రయించారు. ఆ తర్వాత కొన్ని నెలలకే ఆ ఆర్ట్ డీలర్ వేలంలో దానిని 3.6 మిలియన్ పౌండ్లు (రూ. 36,86,17,320)కి విక్రయించాడు.
న్యూస్ పేపర్ల ద్వారా విషయం తెలిసిన వృద్ధ దంపతులు ఆర్ట్ డీలర్‌పై కోర్టుకెక్కారు. తాము విక్రయించిన మాస్క్ అసలు ధరను కావాలనే దాచిపెట్టి తనను మోసం చేశాడని దావా వేశారు. ‘ది మెట్రో న్యూస్’ ప్రకారం.. ఈ మాస్కును గాబన్‌లోని ఫాంగ్ ప్రజలకు చెందినది. వివాహాలు, అంత్యక్రియల సమయంలో దీనిని వారు ఉపయోగిస్తారు. ఈ మాస్కులు అత్యంత అరుదైనవి.
ప్రపంచవ్యాప్తంగా మ్యూజియాలలో కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇది 19వ శతాబ్దానికి చెందినదని, ఇవి అత్యంత అరుదైన, అసాధారణమైనవని కోర్టు పేర్కొంది. ‘ఇండస్ట్రీ మీడియా’ ప్రకారం.. వృద్ధ దంపతుల్లోని మహిళ భర్త తాత ఆఫ్రికాలోని కలోనియల్ గవర్నర్‌గా పనిచేశారు. ఆయన నుంచే అది వీరికి వచ్చింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది.