కేటీఆర్, హరీశ్ రావులతో కేసీఆర్ అత్యవసర భేటీ
- ప్రగతి భవన్ లో కొనసాగుతున్న సమావేశం
- మేనిఫెస్టో, ఎన్నికల ప్రచారంపై కొనసాగుతున్న చర్చ
- ఈ నెల 15న ప్రచారాన్ని ప్రారంభించనున్న కేసీఆర్
ప్రగతి భవన్ లో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులతో మఖ్యమంత్రి కేసీఆర్ అత్యవసర భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎన్నికల మేనిఫెస్టో, ఎన్నికల ప్రచారంపై చర్చిస్తున్నారు. నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ పార్టీ పట్టుదలతో ఉంది. ఇప్పటికే ఎన్నికల అభ్యర్థులను సీఎం కేసీఆర్ ప్రకటించారు. మరోవైపు కొన్ని రోజుల క్రితం వైరల్ ఫీవర్ తో బాధపడిన కేసీఆర్ అనారోగ్యం నుంచి కోలుకున్నారు. ఎన్నికల పర్వంపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తున్నారు. ఈ నెల 15 నుంచి కేసీఆర్ ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నారు. 17 రోజుల్లో 41 నియోజకవర్గాల్లో ప్రచారాన్ని నిర్వహించేలా షెడ్యూల్ ను రెడీ చేశారు. మరోపక్క, ఇప్పటికే కేటీఆర్, హరీశ్ రావులు వరుస సభలతో హోరెత్తిస్తున్నారు.