తెలంగాణ టీడీపీకి బిగ్ షాక్.. బీఆర్ఎస్‌లోకి ఆ పార్టీ పొలిట్ బ్యూరో చీఫ్ రావుల!
- ఇప్పటికే బీఆర్ఎస్ నేతలతో సమావేశం
- ఈ నెల 15లోగా నిర్ణయం
- తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న రావుల
- వనపర్తి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం
అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలేలా ఉంది. ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి బీఆర్ఎస్ గూటికి చేరేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన ఆ పార్టీ నేతలతో చర్చించారని, త్వరలోనే కారెక్కడం పక్కా అని సమాచారం. ఈ నెల 15లోగా ఆయన నిర్ణయం తీసుకుంటారని సన్నిహిత వర్గాల సమాచారం.
1994, 2009లో వనపర్తి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించిన రావుల.. ఉమ్మడి ఏపీ ప్రభుత్వ విప్‌గా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత టీడీపీ నేతలంతా పార్టీని వీడి వివిధ పార్టీల్లో చేరినా.. ఆయన మాత్రం పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు. ప్రస్తుతం ఆయన టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నారు. కాగా, పార్టీని వీడబోతున్నారన్న ప్రచారంపై రావుల ఇప్పటి వరకు స్పందించలేదు.