విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం, మంత్రుల వసతి కోసం కమిటీ ఏర్పాటు

విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం, మంత్రుల వసతి కోసం కమిటీ ఏర్పాటు
  • విశాఖ నుంచి పరిపాలన కోసం ఏర్పాట్లు
  • సన్నాహాలు ముమ్మరం చేసిన ప్రభుత్వం
  • ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ జవహర్ రెడ్డి
విశాఖ నుంచి పరిపాలన సాగించేందుకు వైసీపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. విజయదశమికి విశాఖ వెళ్లిపోతామని సీఎం జగన్ ఇంతకుముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ దిశగా ప్రభుత్వ చర్యలు ముమ్మరం అయ్యాయి. విశాఖలో సీఎం జగన్ క్యాంపు కార్యాలయం, వసతి, మంత్రుల వసతి, సీనియర్ అధికారుల తరలింపు, వసతి గుర్తింపు కోసం అధికారులతో కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ ఏర్పాటుపై రాష్ట్ర  సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, సాధారణ పరిపాలన శాఖ మానవ వనరుల విభాగం కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు.


More Telugu News