బౌండరీ లైన్ వద్ద అద్భుత క్యాచ్ అందుకున్న శార్దూల్ ఠాకూర్
- వన్డే ప్రపంచకప్ 2023లో ఆప్ఘన్‌తో భారత్ ఢీ
- రహ్మనుల్లా గుర్భాజ్ కొట్టిన బంతిని అద్భుతంగా అందుకున్న శార్దూల్
- బౌండరీ లైన్ వద్ద పూర్తి నియంత్రణతో బంతిని పట్టిన ఠాకూర్
వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీలో భాగంగా ఆప్ఘనిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ అద్భుత క్యాచ్‌తో అలరించాడు. బౌండరీ లైన్ వద్ద ఈ క్యాచ్ పట్టాడు. ఆప్ఘన్ ఆటగాడు రహ్మనుల్లా గుర్భాజ్ షాట్ కొట్టి బంతిని పట్టి అతనిని పెవిలియన్‌కు పంపించాడు. 13వ ఓవర్‌లో హార్దిక్ పాండ్యా వేసిన షార్ట్ పిచ్ బంతిని గుర్భాజ్ సిక్స్ మలిచే ప్రయత్నం చేశాడు. ఆ బంతి బౌండరీ లైన్ దాటి అవతలకు వెళ్ళేలా కనిపించింది. ఇంతలో బౌండరీ లైన్ వద్దకు చేరుకున్న ఠాకూర్ పూర్తి నియంత్రణతో మంచి క్యాచ్ అందుకున్నాడు.