ఇది బాలకృష్ణకు సరిపోయే కథ: పరుచూరి గోపాలకృష్ణ
- బాలయ్య, అనిల్ రావిపూడి కలయికలో భగవంత్ కేసరి
- అక్టోబరు 19న ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం
- ఇటీవల విడుదలైన ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్
- ట్రైలర్ చూశాక అభిప్రాయాలను పంచుకున్న పరుచూరి గోపాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ, యువ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న భగవంత్ కేసరి చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. దసరా కానుకగా ఈ చిత్రం అక్టోబరు 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. కాగా, ఇటీవల విడుదల భగవంత్ కేసరి ట్రైలర్ కు విశేష స్పందన లభిస్తోంది.
దీనిపై సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ స్పందించారు. భగవంత్ కేసరి చిత్ర కథ బాలకృష్ణకు సరిపోయే కథ అని పేర్కొన్నారు. ట్రైలర్ చూస్తే తండ్రీ కూతుళ్ల కథలా ఉందని, సినిమా ఎంత బాగుంటుందో ట్రైలర్ ద్వారా చెప్పడం కూడా ఒక కళ అని, అనిల్ రావిపూడిలో అది పుష్కలంగా ఉందని అభిప్రాయపడ్డారు.
బాలకృష్ణ అఖండ, వీరసింహారెడ్డి తర్వాత భగవంత్ కేసరి చిత్రం చేస్తున్నాడని, సహజంగానే వరుస హిట్ల తర్వాత వచ్చే సినిమా ఫలితంపై ఆసక్తి ఉంటుందని, అయితే భగవంత్ కేసరి ట్రైలర్ చూశాకే బాలయ్యకు మరో హిట్ గ్యారెంటీ అనిపించిందని పరుచూరి గోపాలకృష్ణ వివరించారు.
అభిమానుల ఉత్సాహాన్ని ఏమాత్రం తగ్గించని సినిమా ఇదని కితాబునిచ్చారు. బాలయ్య అభిమానులు ఈ దసరా వేళ భగవంత్ కేసరితో పండుగ చేసుకుంటారని వివరించారు.