కీబోర్డును లాంచ్ చేసిన వన్‌ప్లస్.. ధర తెలిస్తే గుండె జారిపోవడం ఖాయం!
- 81 ప్రొ పేరుతో కీబోర్డు విడుదల చేసిన వన్‌ప్లస్
- పాజిటివ్‌గా రివ్యూలు
- రెండు వేరియంట్లలో విడుదల
- క్యాప్‌లతోపాటు కీ పుల్లర్‌ను కూడా ప్రొవైడ్ చేస్తున్న వన్‌ప్లస్
- నాణ్యమైన టైప్-సి కేబుల్
చైనా మొబైల్ మేకర్ వన్‌ప్లస్ ఇప్పటికే టీవీలు, మానిటర్లు, స్మార్ట్‌వాచ్, ఆడియో గేర్, క్లాథింగ్ లైనప్‌లో సత్తా చాటుతుండగా తాజాగా కీబోర్డును ఆ జాబితాలో చేర్చింది. ‘81 ప్రొ’ పేరుతో ఇటీవల మెకానికల్ కీబోర్డును విడుదల చేసింది. ఇది చూడ్డానికి ‘కీక్రోన్ క్యూ1 ప్రొ’ను పోలినట్టుగా ఉంది. వన్‌ప్లస్ కీబోర్డ్ 81 ప్రొ రెండు ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇందులోని పీబీటీ కీ క్యాప్స్‌తో తీసుకొచ్చిన వింటర్ బోన్ ఫైర్ ఆప్షన్ కీబోర్డు ధర రూ. 17,999 మాత్రమే. ఇందులోని టాక్టిల్ స్విచ్‌లు ఎరుపు రంగులో ఉన్నాయి. రెండోదైన సమ్మర్ బ్రీజ్ ఆప్షన్ ధర రూ. 19,999 మాత్రమే. ఇందులో మార్బల్ కీక్యాప్స్ ఉపయోగించారు. కీక్రోన్‌తో కలిసి వన్‌ప్లస్ ఈ కీబోర్డులను విడుదల చేసింది.
సాధారణ కీక్యాప్స్, స్విచ్ పుల్లర్‌ను కూడా అదనంగా ఇస్తోంది. కీబోర్డును సిస్టంకు కనెక్ట్ చేసుకునేందుకు నాణ్యమైన టైప్-సికి కేబుల్‌ను కూడా ప్రొవైడ్ చేస్తోంది. ఇది 1,000హెర్ట్జ్ పోలింగ్ రేటుకు కనెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. విడుదల చేసిన రెండు కీబోర్డుల డిజైన్‌లలో పెద్దగా తేడా ఏమీ లేదు. ఈ కీబోర్డు రివ్యూలు కూడా పాజిటివ్‌నే ఉన్నాయి.