పఠాన్‌కోట్ దాడి సూత్రధారి, భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది షాహిద్ హతం!

  • 2 జనవరి 2016లో పఠాన్‌కోట్‌లో ఉగ్రదాడి
  • సియోల్‌కోట్ నుంచి నలుగురు ఉగ్రవాదుల్ని పంపిన షాహిద్ 
  • గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హతం
భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, పఠాన్‌కోట్ దాడి సూత్రధారి షాహిద్ లతీఫ్ ఈ ఉదయం హతమయ్యాడు. పాకిస్థాన్‌లోని సియోల్‌కోట్‌లో గుర్తుతెలియని సాయుధులు అతడిని కాల్చిచంపారు. ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ సభ్యుడైన 41ఏళ్ల షాహిద్‌పై భారత్‌లో పలు కేసులున్నాయి. 12 నవంబరు 1994లో ఉపాచట్టం కింద అరెస్ట్ అయిన అతడు 16 ఏళ్లపాటు జైలు జీవితం గడిపాడు. 

2010లో వాఘా బోర్డర్ ద్వారా పాక్ చేరాడు. 2 జనవరి 2016లో పఠాన్‌కోట్‌లో జరిగిన ఉగ్రదాడిలో అతడు కీలక పాత్ర పోషించాడు. సియోల్‌కోట్ నుంచే ఈ దాడిని పర్యవేక్షించిన షాహిద్.. ఇందుకోసం నలుగురు ఉగ్రవాదులను పంపాడు.


More Telugu News