వరుసగా రెండో రోజు సీఐడీ విచారణకు హాజరైన నారా లోకేశ్
- అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ విచారణ
- నిన్న లోకేశ్ కు 50 ప్రశ్నలను సంధించిన సీఐడీ
- 49 ప్రశ్నలు రింగ్ రోడ్డుతో సంబంధం లేనివేనని లోకేశ్ విమర్శ
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో వరుసగా రెండో రోజు సీఐడీ విచారణకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని సిట్ కార్యాలయంలో విచారణ ప్రారంభమయింది. నిన్న ఆరున్నర గంటల సేపు లోకేశ్ ను దర్యాప్తు అధికారులు విచారించారు. మొత్తం 50 ప్రశ్నలను అడిగారని.. వాటిలో 49 ప్రశ్నలు రింగ్ రోడ్డుతో సంబంధం లేనివేనని నిన్న విచారణానంతరం లోకేశ్ ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. రింగ్ రోడ్డు వ్యవహారంతో సంబంధం లేని ప్రశ్నలను అధికారులు ఎలా అడుగుతారని ఆయన ప్రశ్నించారు. మరోవైపు ఈరోజు విచారణకు మాజీ మంత్రి పి.నారాయణ అల్లుడు కూడా హాజరయ్యారు.