హమాస్ ఉగ్రవాదులు నగ్నంగా ఊరేగించిన జర్మన్ యువతి బతికే ఉంది!

  • మ్యూజిక్‌ఫెస్ట్ నుంచి యువతిని బంధించి తీసుకెళ్లిన హమాస్ ఉగ్రవాదులు
  • పికప్ ట్రక్‌పై నగ్నంగా ఊరేగింపు
  • తలకు తీవ్ర గాయాలతో పాలస్తీన్‌లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోందన్న తల్లి
  • ప్రతీక్షణం విలువైనదేనని, తన కుమార్తెను రక్షించాలని జర్మన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి
హమాస్ ఉగ్రవాదులు బందీగా చేసుకుని నగ్నంగా ఊరేగించిన 22 ఏళ్ల జర్మన్ యువతి షానీ లౌక్ సజీవంగా ఉన్నట్టు ఆమె తల్లి తెలిపారు. తన కుమార్తె బతికే ఉందని పాలస్తీనా వర్గాల నుంచి తనకు సమాచారం అందిందని రికార్డా లౌక్ వెల్లడించారు. కుమార్తె భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ఆమె షానీని క్షేమంగా రప్పించే ఏర్పాట్లు చేయాలని జర్మనీ ప్రభుత్వాన్ని కోరారు. 

తన కుమార్తె బతికే ఉందని పేర్కొన్న రికార్డా.. తలకు తీవగ్రాయంతో షానీ బాధపడుతోందని, ఆమె పరిస్థతి విషమంగా ఉందని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీ క్షణం విలువైనదేనని పేర్కొన్నారు. కాబట్టి త్వరగా స్పందించి చర్యలు తీసుకోవాలని ఓ వీడియోలో జర్మనీ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఇప్పుడు అధికార పరిధికి సంబంధించి వాదనలు అనవసరమని పేర్కొన్నారు. 

టాటూ ఆర్టిస్ట్ అయిన షానీని శనివారం హమాస్ ఫైటర్లు అపహరించారు. గాజా స్ట్రిప్‌కు సమీపంలోని ఉరిమ్‌లో నెగెవ్ ఎడారి మైదానంలో జరుగుతున్న ట్రైబ్ ఆఫ్ సూపర్‌నోవా మ్యూజిక్ ఫెస్ట్ నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఆమెను బంధించి పికప్ ట్రక్ వెనక నించోబెట్టి నగ్నంగా ఊరేగించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. కాగా, మ్యూజిక్ ఫెస్ట్‌కు హాజరైన వారిపై ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 150 మందికిపైగా మరణించారు.


More Telugu News