చంద్రబాబుకు బెయిల్ రాకపోవడంపై రఘురామకృష్ణరాజు ఆవేదన.. జగన్ పై విమర్శలు

  • అవినాశ్ రెడ్డి, అనంతబాబులకు బెయిల్ వచ్చిందన్న రఘురాజు
  • చంద్రబాబును అన్యాయంగా జైల్లో పెట్టారని ఆవేదన
  • చంద్రబాబుపై జగన్ భాషను ప్రజలు అసహ్యించుకుంటున్నారని వ్యాఖ్య
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అరెస్ట్ గురించి జగన్ ఉపయోగించిన భాషను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. తాను లండన్ లో ఉన్నప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేశారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై ప్రజల్లో నిరసన వ్యక్తమవుతోందని చెప్పారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి గురించి జగన్ వాడిన భాష బజారు భాషలా ఉందని అన్నారు. జగన్ పూర్తిగా దిగజారి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. 

చంద్రబాబును అన్యాయంగా జైల్లో పెట్టారని... ఆయనకు ఇప్పటి వరకు బెయిల్ రాకపోవడం తనకు తీవ్ర ఆవేదనను కలిగిస్తోందని అన్నారు. డ్రైవర్ ను హత్య చేసి శవాన్ని పార్సిల్ చేసిన అనంతబాబుకు బెయిల్ వచ్చిందని... వైసీపీ పార్టీ కార్యక్రమాల్లో ఆయన దర్జాగా పాల్గొంటున్నాడని విమర్శించారు. ఎంపీ అవినాశ్ రెడ్డికి కూడా బెయిల్ దొరికిందని అన్నారు. చంద్రబాబు వంటి నేతకు బెయిల్ రాకపోడం దురదృష్టకరమని చెప్పారు.


More Telugu News