ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టులో విచారణ

  • ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేపట్టాలంటూ ఎమ్మార్పీఎస్ పిటిషన్
  • రాజ్యాంగ విస్తృత ధర్మాసనానికి ఎమ్మార్పీఎస్ పిటిషన్ బదిలీ
  • పిటిషన్ ను పంజాబ్ వర్సెస్ దేవీందర్ సింగ్ కేసుకు జతచేసిన సీజేఐ ధర్మాసనం
సుదీర్ఘకాలంగా నలుగుతున్న ఎస్సీ వర్గీకరణ అంశం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేపట్టాలంటూ ఎమ్మార్పీఎస్ (మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి) పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను సీజేఐ చంద్రచూడ్ రాజ్యాంగ విస్తృత ధర్మాసనానికి బదిలీ చేశారు. పంజాబ్ వర్సెస్ దేవీందర్ సింగ్ కేసుకు జత చేస్తూ సీజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. 

వాదనల సందర్భంగా... ఎస్సీల్లో మాదిగ సామాజిక వర్గం అత్యంత వెనుకబడి ఉందని పిటిషనర్ తెలిపారు. రిజర్వేషన్ ఫలాలు మాదిగలకు సక్రమంగా అందడంలేదని కోర్టుకు విన్నవించారు. 

దీనిపై స్పందిస్తూ... పంజాబ్ వర్సెస్ దేవీందర్ కేసు విస్తృత ధర్మాసనం ఎదుట ఉందని సీజేఐ తెలిపారు. అది కూడా రిజర్వేషన్ల వర్గీకరణకు చెందిన అంశం కావడంతో, ఎమ్మార్పీఎస్ పిటిషన్ ను ఆ కేసుకు జత చేస్తున్నామని వివరించారు.


More Telugu News