యుద్ధ భయాల నుంచి కోలుకున్న స్టాక్ మార్కెట్లు

  • 567 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 178 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 3 శాతం వరకు లాభపడ్డ ఎయిల్ టెల్
ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధ భయాలతో నిన్న నష్టపోయిన మార్కెట్లు ఈరోజు కోలుకున్నాయి. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ, చమురు సరఫరాపై ఈ యుద్ధ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చనే అంచనాలు ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపాయి ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 567 పాయింట్లు లాభపడి 66,079కి చేరుకుంది. నిఫ్టీ 178 పాయింట్లు పెరిగి 19,690కి ఎగబాకింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (2.90%), కోటక్ బ్యాంక్ (2.15%), టాటా మోటార్స్ (2.14%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (2.09%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.50%). 

టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.51%), టీసీఎస్ (-0.22%), టైటాన్ (-0.09%), ఏసియన్ పెయింట్ (-0.05%).  


More Telugu News