ప్రధాని నరేంద్రమోదీకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ ఫోన్
- ఇజ్రాయెల్ ప్రధాని తనకు ఫోన్ చేసి, అక్కడి పరిస్థితులను వివరించారని మోదీ ట్వీట్
- ఈ విపత్కర పరిస్థితుల్లో యావత్ భారత్ ఇజ్రాయెల్‌కు అండగా ఉంటుందన్న ప్రధాని
- ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్ తీవ్రంగా ఖండిస్తుందన్న మోదీ
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రధాని నరేంద్రమోదీకి ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాద దాడులను తీవ్రంగా ఖండించారు. ఇజ్రాయెల్‌కు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బెంజమిన్ తనకు ఫోన్ చేసి మాట్లాడినట్లు మోదీ సోషల్ మీడియా అనుసంధాన ఎక్స్ వేదికగా తెలిపారు.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడి పరిస్థితులను నేతన్యాహూ తనకు ఫోన్ చేసి తెలియజేశారని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆ దేశానికి యావత్ భారత్ అండగా ఉంటుందని తెలిపారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు.