ఆ క్షణాలు నిజంగా అపురూపం... రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రామ్ చరణ్
- నేడు దర్శకధీరుడు రాజమౌళి బర్త్ డే
- వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు
- ఆర్ఆర్ఆర్ స్టిల్స్ పోస్టు చేసి శుభాకాంక్షలు తెలిపిన రామ్ చరణ్
ప్రపంచ సినీ చరిత్రను పరిశీలిస్తే దిగ్గజ సినీ దర్శకులకైనా ఫ్లాపులు రావడం సాధారణం. కానీ ఒకే ఒక్క దర్శకుడు అందుకు మినహాయింపు. ఆ దర్శకుడు రాజమౌళి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2001లో వచ్చిన స్టూడెంట్ నెం.1 చిత్రం నుంచి నేటి ఆర్ఆర్ఆర్ వరకు రాజమౌళి కెరీర్ లో అపజయమన్నదే లేదు. ప్రతి చిత్రం బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టరే.
ముఖ్యంగా బాహుబలి చిత్రాల నుంచి రాజమౌళి పరిధి టాలీవుడ్ ఎల్లలు దాటి అంతర్జాతీయ స్థాయికి విస్తరించింది. ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ లోనూ ఈ దర్శక ధీరుడి పేరు ఘనంగా వినిపించింది. ఇవాళ రాజమౌళి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనపై శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్... రాజమౌళికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మీతో గడిపిన సమయం నిజంగా అపురూపం అని రామ్ చరణ్ పేర్కొన్నారు. హ్యాపీ బర్త్ డే రాజమౌళి గారూ అంటూ ఎక్స్ లో స్పందించారు. ఈ మేరకు ఆర్ఆర్ఆర్ షూటింగ్ స్టిల్స్ ను కూడా పంచుకున్నారు.
రామ్ చరణ్ కెరీర్ లో మగధీర చిత్రం ఒక మేలిమలుపు అని చెప్పాలి. ఆ చిత్రంతో రామ్ చరణ్ టాలీవుడ్ అగ్ర కథానాయకుల జాబితాలో చేరాడు. ఆర్ఆర్ఆర్ తో రామ్ చరణ్ క్రేజ్ దేశదేశాలకు పాకింది. ఈ రెండు చిత్రాలతో తన కెరీర్ ను సుసంపన్నం చేసిన దర్శకుడిగా రాజమౌళి పట్ల రామ్ చరణ్ హృదయంలో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది.