ఎక్స్ లో మరో కీలక మార్పు తీసుకొచ్చిన ఎలాన్ మస్క్

  • వెరిఫైడ్ అకౌంట్ల నుంచి మాత్రమే రిప్లయ్ లు వచ్చేలా మార్పు
  • వెరిఫైడ్ కాని యూజర్లు సమాధానం ఇవ్వడం కుదరదు
  • ప్రముఖులకు ట్రోలింగ్ బెడద తగ్గుతుందని పలువురి వ్యాఖ్య
ట్విట్టర్ ను చేజిక్కించుకున్న తర్వాత ఆ సంస్థను ఎలాన్ మస్క్ సమూలంగా మార్చేస్తున్నారు. బ్లూ టిక్ కు ఛార్జీలు వసూలు చేయడాన్ని ప్రారంభించారు. ట్విట్టర్ పేరును ఎక్స్ గా మార్చారు. తాజాగా ఎక్స్ లో మరో కీలక మార్పు చేటు చేసుకుంది. ట్వీట్ లకు రిప్లై ఇచ్చే యూజర్లను మరింతగా కంట్రోల్ చేయబోతోంది. కేవలం వెరిఫైడ్ అకౌంట్ల నుంచి మాత్రమే రిప్లయ్ లు వచ్చేలా మార్పు చేసింది. దీని వల్ల వెరిఫైడ్ కాని యూజర్లు సమాధానం ఇవ్వడం కుదరదు. మరోవైపు సాధారణ యూజర్లను కూడా వెరిఫైడ్ అకౌంట్ల వైపు మళ్లించేందుకే ఇలా చేశారని పలువురు విమర్శిస్తున్నారు. మరోవైపు ఈ ఆప్షన్ వల్ల ప్రముఖులకు ట్రోలింగుల బెడద తగ్గుతుందని మరికొందరు అంటున్నారు. ఎక్స్ లో వెరిఫైడ్ అకౌంట్ పొందాలంటే యూజర్లు నెలనెలా రూ. 900 చెల్లించాల్సి ఉంటుంది. 



More Telugu News