చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణను మరోసారి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
- చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ వాయిదా
- శుక్రవారం మధ్నాహ్నం 2 గంటలకు తదుపరి విచారణ
- ఇరువైపు వాదనలు ముగిసిన నేపథ్యంలో శుక్రవారం తీర్పు వెలువడే అవకాశం
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. వచ్చే శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు తదుపరి విచారణను వాయిదా వేసింది. చంద్రబాబు తరపున హరీశ్ సాల్వే, ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి వాదలను వినిపించారు. విచారణ సందర్భంగా ఇరువైపుల న్యాయవాదులు తమ వాదనలను గట్టిగా వినిపించారు.
వాదనలను త్వరగా ముగించాలని ఇరువైపు న్యాయవాదులను ధర్మాసనం కోరింది. అయితే ఇరువైపు న్యాయవాదులు తమ వాదనలకు మరో గంట సమయం కావాలని ధర్మాసనాన్ని కోరారు. ఈ క్రమంలో ఇతర కేసులను కూడా విచారించాల్సి ఉందని న్యాయవాదులకు సుప్రీం తెలిపింది. భోజన విరామం తర్వాత ముకుల్ రోహత్గి వాదనలను విన్న న్యాయస్థానం తదుపరి విచారణను వాయిదా వేసింది. పిటిషన్ పై వాదనలు ముగిసిన నేపథ్యంలో శుక్రవారం తీర్పు వెలువడే అవకాశం ఉంది.