తెలంగాణ హైకోర్టులో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు భారీ ఊరట

  • శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ రాఘవేంద్రరాజు అనే వ్యక్తి పిటిషన్
  • అఫిడవిట్ లో తప్పుడు సమాచారం అందించారని పిటిషన్
  • పిటిషన్ ను కొట్టేస్తూ హైకోర్టు తీర్పు
మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ మహబూబ్ నగర్ కు చెందిన రాఘవేంద్రరాజు అనే వ్యక్తి 2019లో హైకోర్టులో పిటిషన్ వేశారు. 2018లో ఎన్నికల అఫిడవిట్ లో శ్రీనివాస్ గౌడ్ తన ఆస్తులు, అప్పుల గురించి తప్పుడు సమాచారం అందించారని పిటిషన్ లో రాఘవేంద్రరాజు పేర్కొన్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించిన అఫిడవిట్ ను మళ్లీ వెనక్కి తీసుకుని... దాన్ని సవరించి అందజేశారని తెలిపారు. ఆయన ఎన్నికను రద్దు చేయాలని కోరారు. దీనిపై ఇరుపక్షాల వాదనలను విన్న హైకోర్టు... తీర్పును నేటికి వాయిదా వేసింది. పిటిషన్ ను కొట్టేస్తూ నేడు తీర్పును వెలువరించింది. దీంతో, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడిన తరుణంలో శ్రీనివాస్ గౌడ్ కు బిగ్ రిలీఫ్ లభించినట్టయింది.


More Telugu News