ఈ ఔషధాలు నిషేధం.. అయినా విచ్చలవిడిగా వినియోగం
- వీటిల్లో ఎక్కువగా దగ్గు ముందులే
- వీటితో అనారోగ్యానికి చేటు అంటూ కేంద్రం హెచ్చరిక
- ఈ సారి వాడే ముందు పరిశీలించుకోవడం మంచిది
మన దేశంలో ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా 14 రకాల ఫిక్స్ డ్ డోస్ కాంబినేషన్ (మిశ్రమ) ఔషధాల వినియోగాన్ని కేంద్ర సర్కారు నిషేధించింది. ఈ మేరకు జూన్ నెలలో కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఈ ఫిక్స్ డ్ డోసేజ్ కాంబినేషన్ ఔషధాల వల్ల చెప్పుకోతగ్గ ఉపయోగాలేవీ ఉండవు. వీటిల్లో ఎక్కువగా దగ్గు ముందులే ఉన్నాయి.
- నిమెసులైడ్, ప్యారాసెటమాల్ కలిపిన మందు తీసుకోకూడదు.
- అమోక్సిసిల్లిన్, బ్రొమ్ హెక్సైన్. ఇది దగ్గు, ఆయాసం తగ్గడానికి సాయపడుతుంది.
- అలెర్జీ, పొడి దగ్గు నివారణకు సూచంచే ఫోల్కోడిన్, ప్రొమెథజైన్ పైనా వేటు పడింది.
- క్లోరోఫెనిరమైన్ మలేట్, డెక్స్ట్రో మెథార్ఫన్, గ్వఫెన్సిన్ ఈ కాంబినేషన్ మందును, పొడిదగ్గు ఉన్న వారికి సూచిస్తారు.
- అలాగే డ్రై కాఫ్ కు వాడే మరొక కాంబినేషన్ అమ్మోనియం క్లోరైడ్, బ్రొమెక్సైన్, డెక్ట్స్రోమెథాఫ్ఫెన్ కూడా నిషేధానికి గురయ్యాయి.
- క్లోరోఫెనిరమైన్ మలేట్, కోడీన్ సిరప్ ను కూడా నిషేధించారు.
- బ్రోమెక్సైన్, డెక్ట్స్రోమెథార్ఫెన్ అమ్మోనియం క్లోరైడ్, మెంథార్ ఉన్న దానిని కూడా వినియోగించరాదు.
- ప్యారాసెటమాల్, బ్రొమెక్సైన్, ఫెనిరమైన్ మలేట్, క్లోరోఫెనిరమైన్ మలేట్, గ్వై ఫెన్సిన్ పై నిషేధం విధించారు.
- క్లోరోఫెనిరమైన్ మలేట్, కోడీన్ ఫాస్ఫేట్, మెంథాల్.. అలాగే, సాల్బూటమాల్, బ్రొమెక్సైన్ పైనా అమలు చేసింది.
- ఫిట్స్ కు వాడే ఫెనిటాయిన్, ఫెనోబార్బిటోన్ కాంబినేషన్ ను ప్రజలు వినియోగించకూడదంటూ నిషేధం విధించింది.
- సాల్బూటమాల్, హైడ్రాక్సీఎథిల్, థియోఫిల్లయిన్, బ్రెమెక్సైన్ కాంబినేషన్ ను కూడా వాడొద్దని కేంద్రం హెచ్చరించింది.