ఆహాలో 'బలగం' తరహా సినిమా 'మట్టికథ'

  • తెలంగాణ జీవనచిత్రంగా 'మట్టికథ'
  • దర్శకత్వం వహించిన పవన్ కడియాల 
  • 9 అంతర్జాతీయ అవార్డులను దక్కించుకున్న సినిమా 
  • ఈ నెల 13 నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ 
ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు చాలా వరకూ గ్రామాల దిశగా పరుగులు పెడుతున్నాయి. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించిన సినిమాలు చాలా వరకూ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతున్నాయి. ఇక తెలంగాణ నేపథ్యంలో .. తెలంగాణ యాసతో కూడిన కథలకి కూడా విశేషమైన ఆదరణ లభిస్తోంది. ఈ విషయాన్ని 'బలగం' సినిమా మరోసారి నిరూపించింది. 

ఆ సినిమా తరహాలోనే ఇటీవల 'మట్టికథ' థియేటర్లకు వచ్చింది. సరైన పబ్లిసిటీ .. పెద్దగా అంచనాలు లేకపోవడం జరిగింది. సినిమా చూసిన వాళ్లు మాత్రం కంటెంట్ కి కనెక్ట్ అయ్యారు. విడుదలకు ముందే 9 అంతర్జాతీయ అవార్డులను దక్కించుకున్న సినిమా ఇది. అలాంటి ఈ సినిమా ఈ నెల 13వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. 

అప్పిరెడ్డి - సతీశ్ మంజీర నిర్మించిన ఈ సినిమాకి, పవన్ కడియాల దర్శకత్వం వహించాడు. అజయ్ వేద్ .. సుధాకర్ రెడ్డి .. దయానంద్ రెడ్డి .. కనకవ్వ ముఖ్యమైన పాత్రలను పోషించారు. తెలంగాణ గ్రామీణ సంస్కృతి .. మట్టితో పెనవేసుకుపోయిన జీవితాలు .. మానవ సంబంధాలు ప్రధానమైన అంశాలుగా ఈ కథలో కనిపిస్తాయి. స్మరణ్ సాయి సంగీతాన్ని అందించిన ఈ సినిమాకి, ఓటీటీ వైపు నుంచి ఏ స్థాయి రెస్పాన్స్ వస్తుందనేది చూడాలి. 



More Telugu News