నేడు, రేపు కృష్ణా ఎక్స్‌ప్రెస్ రద్దు.. రైల్వే అధికారుల ప్రకటన
- సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో ఇంటర్‌లాకింగ్ పనులతో రైలు రద్దు
- గత రెండు వారాల్లో కృష్ణా ఎక్స్‌ప్రెస్ రద్దు కావడం ఇది రెండోసారి
- మరో మూడు ప్యాసింజర్ రైళ్ల రద్దును 15 వరకూ పొడిగింపు
సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా ఈ నెల 10, 11 తేదీల్లో కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను అధికారులు రద్దు చేశారు. ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి నగదు తిరిగి చెల్లిస్తామని పేర్కొన్నారు. అదిలాబాద్-తిరుపతి మధ్య నడిచే ఈ రైలు రద్దు కావడం గత రెండువారాల్లో ఇది రెండోసారి.
మరోవైపు, కాజీపేట-డోర్నకల్ మద్య నడిచే డోర్నకల్ ప్యాసింజర్, సికింద్రాబాద్-వరంగల్ మధ్య నడిచే పుష్‌పుల్, కాజీపేట-బల్లార్షా మద్య నడిచే బల్లార్షా ఎక్స్‌ప్రెస్ రైళ్ల రద్దును ఈ నెల 15 వరకూ పొడిగిస్తున్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారు.