యుద్ధాన్ని మేం మొదలు పెట్టలేదు కానీ, ముగించేది మేమే: ఇజ్రాయెల్ ప్రధాని

  • దేశప్రజలను ఉద్దేశించి ఇజ్రాయెల్ ప్రధాని ప్రసంగం
  • హమాస్ చారిత్రక తప్పిదం చేసిందని వ్యాఖ్య
  • ఇజ్రాయెల్ ప్రతిదాడి శత్రుదేశాలకు దశాబ్దాల పాటు గుర్తుండిపోతుందని హెచ్చరిక
  • అమెరికా అధ్యక్షుడికి కృతజ్ఞతలు
పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌తో యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ దేశ ప్రజలను ఉద్దేశించి తాజాగా మాట్లాడారు. యుద్ధం తాము ప్రారంభించకపోయినా ముగించేది మాత్రం తామేనని హమాస్‌కు ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. ‘‘ప్రస్తుతం దేశం యుద్ధం చేస్తోంది. దీన్ని మేం కోరుకోలేదు. కానీ, దేశాన్ని కాపాడుకోవాల్సిన స్థితిలో ఈ యుద్ధం చేయాల్సి వస్తోంది. కానీ ముగించేది మాత్రం మేమే. మా ప్రతిదాడి హమాస్‌తో పాటు ఇజ్రాయెల్ శత్రుదేశాలకు దశాబ్దాల పాటు గుర్తుండిపోతుంది. ఇజ్రాయెల్‌పై దాడితో హమాస్ చారిత్రక తప్పిదానికి పాల్పడింది’’ అంటూ నేతన్యాహూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

హమాస్ కూడా ఐసిస్ లాంటి ఉగ్ర సంస్థేనని నేతన్యాహు పేర్కొన్నారు. ప్రజలంతా కలిసికట్టుగా దాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు. హింస, అనాగరికతకు వ్యతిరేకంగా పోరాడే ప్రతి దేశం తరపునా ఇజ్రాయెల్ ఈ యుద్ధం చేస్తోందని చెప్పారు. కాగా, తమకు మద్దతు తెలిపిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు నేతన్యాహు కృతజ్ఞతలు తెలిపారు.


More Telugu News