తెలంగాణ ఓటరు నాడి ఎలా ఉందంటే...! అత్యంత ఆసక్తికరంగా సీ-ఓటర్ సర్వే

  • తెలంగాణలో నవంబరు 30న అసెంబ్లీ ఎన్నికలు
  • షెడ్యూల్ విడుదల
  • ఒపీనియన్ పోల్స్ ఫలితాలు వెల్లడించిన ఏబీపీ-సీ ఓటర్
  • కాంగ్రెస్ కు అత్యధిక స్థానాలు లభించే అవకాశముందన్న సర్వే
తెలంగాణలో నవంబరు 30న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏబీపీ-సీ ఓటర్ సర్వేలో అత్యంత ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. సీ-ఓటర్ ఒపీనియన్ పోల్స్ లో వెల్లడైన అభిప్రాయాల ప్రకారం... కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు లభించే అవకాశం ఉంది. 

తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా... కాంగ్రెస్ పార్టీ 48 నుంచి 60 స్థానాల్లో జయకేతనం ఎగురవేస్తుందని సీ-ఓటర్ సర్వే చెబుతోంది. అదే సమయంలో బీఆర్ఎస్ కు 43 నుంచి 55 స్థానాలు లభిస్తాయని వెల్లడించింది. ఇక, బీజేపీకి తెలంగాణ ఎన్నికల్లో మూడో స్థానమేనని సర్వే పేర్కొంది. బీజేపీ 5 నుంచి 11 సీట్లు గెలుచుకోవచ్చని తెలిపింది. 

అంతేకాదు, ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ల శాతం 10.5 శాతం పెరిగే అవకాశం ఉందని సీ-ఓటర్ వెల్లడించింది. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ల శాతం 39 అని, బీఆర్ఎస్ ఓట్ల శాతం 37 అని వివరించింది. 2018 ఎన్నికలతో పోల్చితే బీఆర్ఎస్ ఓట్ల శాతం 9.4 శాతం తగ్గుదల నమోదు కావొచ్చని అభిప్రాయపడింది. బీజేపీ ఓట్ షేర్ కూడా 9.3 శాతం మేర పెరిగే అవకాశాలున్నాయని పేర్కొంది.


More Telugu News