ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం ఎఫెక్ట్.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • 483 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 141 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
  • అంతర్జాతీయంగా అన్ని మార్కెట్లపై యుద్ధం ప్రభావం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 483 పాయింట్లు నష్టపోయి 65,512కి పడిపోయింది. నిఫ్టీ 141 పాయింట్లు కోల్పోయి 19,512 వద్ద స్థిరపడింది. ఇజ్రాయెల్ - పాలస్తీనాల మధ్య యుద్ధ ప్రభావం మార్కెట్లపై పడింది. చమురు ధరలు పెరగడం కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. అంతర్జాతీయంగా అన్ని మార్కెట్లపై దీని ప్రభావం ఉంది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.02%), టీసీఎస్ (0.47%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.47%). 

టాప్ లూజర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (-2.05%), బజాజ్ ఫైనాన్స్ (-1.73%), టాటా స్టీల్ (-1.67%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.53%), కోటక్ బ్యాంక్ (-1.35%).


More Telugu News