రైతుబంధు సమితి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యే రాజయ్య

  • స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే టిక్కెట్ దక్కకపోవడంతో కార్పోరేషన్ పదవి ఇచ్చిన కేసీఆర్
  • రైతుబంధు సమితి అధ్యక్షుడిగా రెండేళ్ల పాటు కొనసాగనున్న రాజయ్య
  • ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన రాజయ్య
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సోమవారం రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ 115 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో స్టేషన్ ఘనపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్యకు అవకాశం దక్కలేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. పార్టీ నేతలు ఆయనతో సంప్రదింపులు జరిపి, బుజ్జగించారు. ఈ క్రమంలో రైతుబంధు సమితి అధ్యక్షుడిగా నియమించారు. రాజయ్య ఈ రోజు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. కాగా, ఈ కార్పోరేషన్ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగుతారు.


More Telugu News