తెలంగాణలో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్
- ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం
- షెడ్యూల్ విడుదలైన వెంటనే అమల్లోకి వచ్చిన కోడ్
- ఆగిపోనున్న శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
తెలంగాణలో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు (రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం) కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 30న తెలంగాణలో ఒకే విడతలో ఎన్నికలు జరుగుతాయని సీఈసీ ఈ మధ్యాహ్నం ప్రకటించింది. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఈ మధ్యాహ్నం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఆగిపోనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే షెడ్యూల్ చేసుకున్న కార్యక్రమాలకు కూడా బ్రేక్ పడింది. ఈరోజు ట్రైబల్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్, రాంజీగోండు స్మారక ట్రైబల్ మ్యూజియం శంకుస్థాపనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఎన్నికల కోడ్ రావడంతో ఆ కార్యక్రమాలు నిలిచిపోయాయి. కోడ్ నేపథ్యంలో ప్రభుత్వాల పరంగా ఎలాంటి అధికారిక ప్రకటనలు, జీవోలు జారీ చేసేందుకు వీలు ఉండదు.