సురేందర్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చిన వెంకటేశ్!

సురేందర్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చిన వెంకటేశ్!
  • వరుస హిట్స్ తో ఉన్న వెంకటేశ్ 
  • ప్రస్తుతం సెట్స్ పై ఉన్న 'సైంధవ్'
  • 76వ సినిమా కోసం సన్నాహాలు 
  • ఫ్యామిలీ ఎమోషన్స్ నేపథ్యంలో సాగే కథ
కొంతకాలంగా వెంకటేశ్ వరుస హిట్లను నమోదు చేస్తూ వస్తున్నారు. 'నారప్ప' .. 'దృశ్యం 2' .. 'ఎఫ్ 3' సినిమాలతో ఆయన తన దూకుడు కొనసాగిస్తున్నారు. త్వరలో ఆయన నుంచి రావడానికి 'సైంధవ్' సినిమా సిద్ధమవుతోంది. శైలేశ్ కొలను ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ ప్రధానంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

కెరియర్ పరంగా ఇది వెంకటేశ్ కి 75వ సినిమా. ఇక 76వ సినిమాను కూడా వెంకటేశ్ సెట్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. సురేందర్ రెడ్డి ఒక కథ చెప్పడం .. యాక్షన్ - ఫ్యామిలీ ఎమోషన్స్ నేపథ్యంతో కూడిన ఆ కథ వెంకటేశ్ కి నచ్చడం జరిగిపోయిందని అంటున్నారు.  
 
సురేందర్ రెడ్డి మేకింగ్ చాలా స్టైలీష్ గా ఉంటుంది. యాక్షన్ సీన్స్ పై ఆయన మార్కు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటుంది. ఇద్దరి కాంబినేషన్లోని ప్రాజెక్టుకి సంబంధించిన సన్నాహాలు మొదలయ్యాయని చెబుతున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని అంటున్నారు. 'సైరా' .. 'ఏజెంట్' ఫ్లాపుల తరువాత సురేందర్ రెడ్డి చేస్తున్న ఈ సినిమా, ఆయనకి చాలా కీలకమైనదేనని చెప్పాలి.


More Telugu News