చంద్రబాబును అరెస్ట్ చేశామనుకుంటున్నారు కానీ దాని గురించి ఆలోచించట్లేదు: మురళీ మోహన్
- చంద్రబాబు అరెస్ట్ తెలుగువారందరినీ కలిచివేస్తోందన్న మురళీ మోహన్
- గ్రహణం తర్వాత చంద్రుడు, సూర్యుడు వెలిగిపోయినట్లు చంద్రబాబు రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తారన్న మాజీ ఎంపీ
- అరెస్ట్ చేశారు కానీ, ఎంత సింపతీ వస్తుందో అర్థం చేసుకోలేదన్న మురళీ మోహన్
టీడీపీ అధినేత చంద్రబాబును జైల్లో పెట్టడం తెలుగువారందరినీ కలిచివేస్తోందని ప్రముఖ సినీ నటుడు, లోక్ సభ మాజీ సభ్యుడు మురళీ మోహన్ అన్నారు. మాదాపూర్‌లో ఓ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తిని జైల్లో పెట్టడం సరికాదన్నారు. ఈ కేసుల నుంచి మచ్చలేని నాయకుడిగా ఆయన బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
అందరి అభిమాన నాయకుడు చంద్రబాబు జైల్లో ఉండటం చూస్తుంటే చాలా బాధగా ఉందన్నారు. హైదరాబాద్, బెంగళూరు మాత్రమే కాదని, దేశవిదేశాల్లోను చాలామంది ఈ అరెస్టుపై బాధపడుతున్నట్లు చెప్పారు. ఇప్పుడు గ్రహణం పట్టిందనుకోవాలని, చంద్రుడికి, సూర్యుడికి గ్రహణం పడుతుందని, కానీ ఆ గ్రహణం వీడిపోయాక అదే చంద్రుడు, సూర్యుడు దేదీప్యమానంగా వెలుగొందుతాయని, ఇప్పుడు చంద్రబాబు కూడా అంతే అన్నారు. కచ్చితంగా ఆయన రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తారన్నారు.
ఆయన ఏదో తప్పు చేశాడని చెబుతూ, జైల్లో పెట్టామని భావిస్తున్నారని, కానీ ఎంత సింపతీ వస్తుందో అర్థం చేసుకోలేదన్నారు. ప్రజల నుంచి చంద్రబాబుకు అనుకూలంగా ఎంతో మద్దతు వస్తోందన్నారు. ఆయన అధికారంలోకి రావాలని అందరూ కోరుకుంటున్నారన్నారు.