టీటీడీ కల్యాణ మండపాల్లో డీజేలకు నో పర్మిషన్
- తిరుమలలో టీటీడీ పాలకమండలి సమావేశం
- పలు కీలక నిర్ణయాలకు బోర్డు ఆమోదం
- వివరాలు తెలిపిన టీటీడీ చైర్మన్ భూమన
రాష్ట్రంలోని టీటీడీ కల్యాణ మండపాల్లో జరిగే వివాహ కార్యక్రమాల్లో ఇకపై డీజేలు ఏర్పాటు చేయడం కుదరదు. ఈ మేరకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. టీటీడీ కల్యాణ మండపాల్లో జరిగే పెళ్లిళ్లలో డీజేలకు బదులుగా లలిత సంగీత కార్యక్రమాలకు మాత్రమే అనుమతి ఇస్తామని టీటీడీ ప్రకటించింది. ఇవాళ తిరుమల అన్నమయ్య భవన్ లో టీటీడీ పాలకమండలి సమావేశమైంది. ఈ సమావేశంలో బోర్డు పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.
ఈ సమావేశంలో టీటీడీ పారిశుద్ధ్య కార్మికులకు వేతనం పెంపు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు వారికి రూ.12 వేలు ఇస్తుండగా, ఇకపై వారికి రూ.17 వేల వేతనం ఇవ్వనున్నారు. టీటీడీ నిర్ణయంతో 5 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు లబ్ది పొందనున్నారు.
అంతేకాదు, టీటీడీ పరిధిలోని కార్పొరేషన్ లో పనిచేసే ఉద్యోగుల వేతనాలను ప్రతి ఏడాది 3 శాతం పెంచాలని బోర్డు నిర్ణయించింది. కార్పొరేషన్ లో పనిచేసే ఉద్యోగులు ఆకస్మిక మరణం చెందితే రూ.2 లక్షల పరిహారం, కార్పొరేషన్ లో పనిచేస్తూ ఈఎస్ఐ వర్తించని ఉద్యోగులకు హెల్త్ స్కీం వర్తింపు నిర్ణయాలు కూడా ఈ సమావేశంలో తీసుకున్నారు.
టీటీడీ తీసుకున్న ముఖ్య నిర్ణయాలు...

- తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో కంపార్ట్ మెంట్ల ఏర్పాటుకు రూ.18 కోట్లు
- ఆకాశ గంగ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణానికి రూ.40 కోట్లు
- వరాహస్వామి గెస్ట్ హౌస్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణానికి రూ.10.8 కోట్లు
- తిరుపతి చెర్లోపల్లి నుంచి శ్రీనివాస మంగాపురం వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణానికి రూ.25 కోట్లు
- నారాయణ గిరిలోని హోటళ్లు, అన్నమయ్య భవన్ లోని హోటళ్ల నిర్వహణ బాధ్యత పర్యాటక శాఖకు అప్పగింత
- అలిపిరి వద్ద నిత్యం శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిర్వహణ. భక్తులు కూడా ఈ హోమంలో స్వయంగా పాల్గొనే అవకాశం.
- ప్రాచీన ఆలయ గోపురాల నిర్వహణ పర్యవేక్షణకు నిపుణులతో కమిటీ
- టీటీడీ పరిధిలోకి... తిరుపతిలోని టీటీడీ అనుబంధ ఆలయాలు, భక్తులు సంచరించే ప్రాంతాల్లో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యతలు
- టీటీడీ పరిధిలోని పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన భోజన సౌకర్యం కల్పించాలని నిర్ణయం