చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంలో కొనసాగుతున్న వాదనలు

  • ఏపీ సీఐడీ తరఫున వాదనలు వినిపిస్తోన్న ముకుల్ రోహత్గీ
  • చంద్రబాబు తరఫున వాదనలు వినిపిస్తోన్న హరీశ్ సాల్వే
  • లంచ్ బ్రేక్ తర్వాత కొనసాగుతున్న వాదనలు
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సోమవారం లంచ్ బ్రేక్ తర్వాత సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఏపీ సీఐడీ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తుండగా, టీడీపీ అధినేత తరఫున మరో సీనియర్ హరీశ్ సాల్వే వాదిస్తున్నారు.

లంచ్ బ్రేక్‌కు ముందు ప్రారంభమైన వాదనలు, ఆ తర్వాత కూడా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా హరీశ్ సాల్వే మాట్లాడుతూ... 17ఏకు డేట్ ఆఫ్ ఎఫ్ఐఆర్ వర్తిస్తుందా? లేదా? డేట్ ఆఫ్ అఫెన్స్ కింద వర్తిస్తుందా? అనేది కోర్టు ఎదుట ఉంచామని తెలిపారు. నేరుగా నగదు తీసుకుంటూ పట్టుబడితే తప్ప మిగిలిన అన్నింటికీ 17ఏ వర్తిస్తుందని కోర్టుకు విన్నవించారు.

ఈ సందర్భంగా కోర్టు జోక్యం చేసుకొని, కేసు విచారణ ఎప్పుడు ప్రారంభమైందని ప్రశ్నించింది. ఈ కేసుకు సంబంధించి 2021 సెప్టెంబర్ 7న ఫిర్యాదు వచ్చిందని, డిసెంబర్ 9న ప్రాథమిక విచారణ జరిగిందని హరీశ్ సాల్వే కోర్టుకు తెలిపారు.


More Telugu News