ఉగ్రవాదులు, వారి మద్దతుదారులకు కేంద్రంగా కెనడా.. ఈ వీడియోనే రుజువు
- మిస్సిసగా పట్టణంలో హమాస్ కు మద్దతుగా ర్యాలీ
- పాలస్తీనా పతకాన్ని ప్రదర్శించిన యువకులు
- హమాస్ చర్యను ఖండించిన కెనడా ప్రధాని ట్రూడో
కెనడా వైఖరి ఏంటన్నది మరోసారి రుజువు అయింది. అక్కడి ప్రధాని జస్టిన్ ట్రూడో చెప్పే మాటలకు, చేతలకు పొంతనే లేదని తెలుస్తోంది. భారత వ్యతిరేక, వేర్పాటు వాద శక్తులకు, ఉగ్రవాదులకు కెనడా షెల్టర్ గా మారిందంటూ మన దేశం ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఖలిస్థానీ అనుకూల వాదులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. అయినా కెనడా ఈ విషయంలో ఇంత వరకు ఎలాంటి సాయం అందించలేదు. పైగా ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందంటూ జస్టిన్ ట్రూడో ఆరోపించి, ద్వైపాక్షిక వివాదానికి ఆజ్యం పోశారు.
భారత్ ఆరోపిస్తున్నట్టు కెనడా ఉగ్రవాదులకు అడ్డాగా మారిందనడానికి ఓ బలమైన నిదర్శనం తాజాగా వెలుగు చూసింది. ఒకవైపు ఇజ్రాయెల్ పై హమాస్ మిలిటెంట్ల దాడిని కెనడా ప్రధాని ఖండించగా.. మరోవైపు మిస్సిసగా (కెనడాలోని ఓ పట్టణం)లో హమాస్ కు మద్దతుగా కొన్ని మూకలు సంబరాలు చేసుకున్నాయి. కారుపై ర్యాలీ చేశాయి. పాలస్థీనా పతాకాన్ని ప్రదర్శించాయి. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. హమాస్ మిటిలెంట్ల దాడిలో ఇప్పటికే 700కు పైగా ఇజ్రాయెల్ వాసులు మరణించడం తెలిసిందే. ఇక హమాస్ చర్యలకు మద్దతుగా తుర్కియే, యూరప్ లోని పలు దేశాల్లోనూ ర్యాలీలు జరిగాయి.