మిలిటెంట్ సంస్థ హమాస్ కు అత్యాధునిక ఆయుధాలు ఎక్కడివి..?

  • హమాస్ గ్రూప్ దగ్గర డ్రోన్లు, గ్లైడర్లు, రాకెట్లు
  • సాధారణ ప్రజలను కవచాల్లా వాడుకుంటూ దాడులు
  • ఇజ్రాయెల్ ఆర్మీలో యుద్ధ విమానాలు, మెర్కావా ట్యాంకులు
హమాస్ గ్రూప్.. గాజా స్ట్రిప్ అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలు చూస్తున్న మిలిటెంట్ సంస్థ. అయినప్పటికీ ప్రపంచంలోనే పేరొందిన గూఢచార వ్యవస్థ కలిగిన ఇజ్రాయెల్ ను ముప్పు తిప్పలు పెడుతోంది. అత్యాధునిక ఆయుధాలతో దాడులు చేస్తోంది. ఉగ్ర దాడులతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రపంచ దేశాల గుర్తింపే లేకుండా, ఓ మిలిటెంట్ సంస్థగా పేరొందిన హమాస్ కు ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి.. హమాస్ కు మద్దతుగా ఆయుధాలను ఎవరు అందిస్తున్నారు..? ఇజ్రాయెల్, హమాస్ ల బలాబలాలు ఏంటనే వివరాలు తెలుసుకుందాం..

హమాస్ గ్రూప్..
రాకెట్లు, అత్యాధునిక గ్లైడర్లు, డ్రోన్లు, సముద్ర మార్గంలో దాడులకు బోట్లు తదితర ఆయుధాలు హమాస్ గ్రూప్ వద్ద ఉన్నాయి. ఇరాన్ సహా ముస్లిం దేశాలు చాటుగా దీనికి ఆయుధాలను సమకూరుస్తున్నాయి. ఇదొక మిలిటెంట్ సంస్థ.. సంప్రదాయ యుద్ధరీతులను అనుసరించాల్సిన అవసరం కానీ, పట్టింపు కానీ లేదు. దీంతో తమకు అందుబాటులో ఉన్న ఆయుధాలతోనే ఇజ్రాయెల్ పై విరుచుకుపడుతోంది. పారా గ్లైడర్లతో ఇజ్రాయెల్ భూభాగంలో దిగిన హమాస్ మిలిటెంట్ల లక్ష్యం వీలైనంత విధ్వంసం సృష్టించడమే. మరణం తప్పదని తెలుసు.. చనిపోయేలోగా వీలైనంతగా ఇజ్రాయెల్ భూభాగాన్ని ధ్వంసం చేయడమే టార్గెట్ గా దాడులు చేశారు. హమాస్ గ్రూప్ మరొక కీలక ఆయుధం.. ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా పట్టుకుని వారిని కవచాలుగా వాడుకుంటూ దాడులు చేయడం.

ఇజ్రాయెల్..
శక్తిమంతమైన గూఢచార వ్యవస్థ, యుద్ధ విమానాలు, యుద్ధ ట్యాంకులతో సంప్రదాయ పద్ధతులతో ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది. ఎఫ్-35 యుద్ధ విమానాలు, స్మార్ట్ బాంబులు, దాదాపు 500 లకు పైగా మెర్కావా ట్యాంకులు, మిస్సైల్ బోట్లతో పాటు అత్యాధునిక ఆయుధ సంపత్తి, సుశిక్షుతులైన సైనికులు ఇజ్రాయెల్ సొంతం. అదేవిధంగా ఇజ్రాయెల్ అణ్వాయుధ దేశం కూడా.. అయితే, హమాస్ గ్రూప్ తో ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంలో అణ్వాయుధాలను ప్రయోగించే అవకాశం లేదు.


More Telugu News