ఫ్రైడే వచ్చిన సినిమాలపై టాక్ ఇదే!
- ఈ నెల 6వ తేదీన 6 సినిమాల రిలీజ్
- ఎక్కువ మార్కులు కొట్టేసిన 'మ్యాడ్'
- మంచి వసూళ్లతో ముందుకెళుతున్న సినిమా
- నిరాశ పరిచిన సుధీర్ బాబు - కిరణ్ అబ్బవరం
క్రితం శుక్రవారం .. అంటే ఈ నెల 6వ తేదీన దాదాపు అరడజను సినిమాలు థియేటర్లలోకి దిగిపోయాయి. కాస్త అటు ఇటుగా అన్నీ చిన్న సినిమాల జాబితాలోకే వస్తాయి. దాంతో కంటెంట్ బాగుందనే టాక్ వస్తే, అప్పుడు థియేటర్ కి వెళ్లొచ్చులే అనుకునే ఆడియన్స్ ఎక్కువగానే ఉంటారు.
విడుదలైన 6 సినిమాలలో 'మంత్ ఆఫ్ మధు' .. '800' .. అనువాద చిత్రంగా వచ్చిన 'చిన్నా' సినిమాపై మొదటి నుంచి కూడా అంత బజ్ కనిపించలేదు. 'చిత్తా' (చిన్నా) తమిళంలో సక్సెస్ అయినా, తెలుగు ఆడియన్స్ అంతగా ఆసక్తిని కనబరచకపోవడం ఆశ్చర్యకరమే.
ఇక 'మామా మశ్చీంద్ర'లో సుధీర్ బాబు ఏదో కొత్తదనం కోసం ట్రై చేశాడనే విషయం ఆడియన్స్ కి అర్థమైంది. దాంతో ఈ సినిమాపై కూడా కొంతవరకూ బజ్ కనిపించింది. అయితే చివరికి వచ్చేసరికి, ఆడియన్స్ కాస్త ఎక్కువ ఉత్సాహాన్ని చూపిస్తున్న సినిమాల జాబితాలో 'రూల్స్ రంజన్' .. 'మ్యాడ్' మాత్రమే నిలిచాయి.
'రూల్స్ రంజన్' విషయానికి వచ్చేసరికి అనుకున్నది ఒక్కటీ .. అయినది ఒక్కటి అన్నట్టుగా నిరాశపరిచింది. ఇక 'మ్యాడ్' మాత్రం స్టూడెంట్స్ కి బాగానే కనెక్ట్ అయింది. ఇంజనీరింగ్ కాలేజ్ చుట్టూ .. హాస్టల్ చుట్టూ తిరిగే ఈ కథ, వాళ్లకి కనెక్ట్ అయింది. అందువల్లనే ఇప్పుడు ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతూ తన దూకుడు చూపిస్తోంది.