ఔటైన ఫ్రస్ట్రేషన్ లో డ్రెస్సింగ్ రూమ్ లో తల బాదుకున్న కోహ్లీ.. వీడియో వైరల్!
- నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ఇండియా విజయం
- 85 పరుగుల వద్ద ముగిసిన కోహ్లీ అద్భుత బ్యాటింగ్
- 78వ సెంచరీని మిస్ అయిన కోహ్లీ
వరల్డ్ కప్ లో భాగంగా నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో టీమిండియా విజయం సాధించింది. స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ తన కెరీర్లో మరో అద్భుతమైన ఇన్నింగ్ ఆడాడు. 200 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్ కేవలం 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఏం జరుగుతోందో అర్థంకాక అందరూ షాక్ లో ఉన్న తరుణంలో కేఎల్ రాహుల్ తో కలిసి కోహ్లీ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. జట్టు స్కోరు 20 పరుగుల వద్ద ఉన్నప్పుడు కోహ్లీ ఇచ్చిన క్యాచ్ ను మిచెల్ మార్ష్ వదిలేశాడు. ఈ తప్పిదానికి ఆస్ట్రేలియా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది.
కోహ్లీ, రాహుల్ ఇద్దరూ కలిసి భారత్ స్కోరును నెమ్మదిగా పెంచుతూ పోయారు. కేఎల్ రాహుల్ పార్ట్ నర్ షిప్ ను పెంచేందుకు యత్నించగా... మరో ఎండ్ లో కోహ్లీ ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడటం ప్రారంభించాడు. ఈ క్రమంలో 75 బంతుల్లో కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 80 పరుగులు దాటిన తర్వాత కోహ్లీ తన 78వ సెంచరీని సాధించబోతున్నాడని అందరూ భావించారు. అయితే 85 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హాజిల్ వుడ్ బౌలింగ్ లో లబుషేన్ కి క్యాచ్ ఇచ్చి కోహ్లీ నిరాశగా పెవిలియన్ చేరాడు. డ్రస్సింగ్ రూమ్ లోకి వెళ్లిన తర్వాత ఫ్రస్టే ఫ్రస్ట్రేషన్ లో కోహ్లీ తన రెండు చేతులతో తల బాదుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరోవైపు, హార్ధిక్ పాండ్యాతో కలిసి కేఎల్ రాహుల్ టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. 41.2 ఓవర్లలో భారత్ 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 97 పరుగులతో నాటౌట్ గా నిలిచిన కేఎల్ రాహుల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు.