ఇజ్రాయెల్‌లో హమాస్ మిలిటెంట్ల అరాచకాలు.. యువతులే లక్ష్యంగా దాడులు
- మహిళలు, యువతులు, చిన్నారులను లక్ష్యంగా చేసుకుంటున్న హమాస్ ఉగ్రవాదులు
- ఇజ్రాయెల్ చెరలో ఉన్న 5,200 మంది పాలస్తీనియన్లను విడిపించుకునే వ్యూహం
- రోడ్లపై చెల్లాచెదురుగా మృతదేహాలు
ఇజ్రాయెల్‌పై మెరుపుదాడికి దిగి ఆ దేశంపై పట్టుసాధించాలని ప్రయత్నిస్తున్న హమాస్ మిలిటెంట్లు యువతులను లక్ష్యంగా చేసుకున్నారు. మహిళలు, చిన్నారులను అపహరిస్తూ.. వారిపై అత్యాచారాలకు పాల్పడుతూ ఘోర అకృత్యాలకు పాల్పడుతున్నారు. మారణాయుధాలతో ఇజ్రాయెల్ వీధుల్లో మారణహోమం సృష్టిస్తున్న హమాస్ ఉగ్రవాదులు కనిపించిన వారిని కనిపించినట్టు కాల్చి చంపుతున్నారు. ఫలితంగా మృతదేహాలతో రోడ్లు నిండిపోతున్నాయి. ఎక్కడ చూసినా భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఎవరికి చిక్కుతామో తెలియక ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోనే గడుపుతున్నారు.
యువతి నగ్న ఊరేగింపు
ఇజ్రాయెల్-గాజాస్ట్రిప్ సరిహద్దులో జరిగిన ‘పీస్ మ్యూజిక్ ఫెస్టివల్’పై దాడిచేసిన మిలిటెంట్లు యువతులను లక్ష్యంగా చేసుకున్నారు. అందులోని అర్గమణి అనే పాతికేళ్ల యువతిని కిడ్నాప్ చేసి బైక్‌పై తీసుకెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యువతితోపాటు ఆమె ప్రియుడు నాథన్‌ను కూడా గాజా తీసుకెళ్లారు. తనను చంపొద్దని, విడిచిపెట్టాలని అర్గమణి వారిని వేడుకోవడం ఆ వీడియోలో కనిపించింది. అలాగే, మరో యువతిని నగ్నంగా ఊరేగించి పాశవికంగా చంపేసిన దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకు 35 మంది సైనికులతోపాటు 100 మందికిపైగా మహిళలు, యువతులను హమాస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) వర్గాలు తెలిపాయి.
బాలుడిపై కర్రలతో దాడి
హమాస్ అధీనంలోని గాజాస్ట్రిప్ సరిహద్దులో వెలుగుచూస్తున్న దురాగతాలు మనసులు పిండేస్తున్నాయి. ఓ ఇజ్రాయెల్ బాలుడిపై గాజాలోని కుర్రాళ్లు కర్రలతో విచక్షణ రహితంగా చావబాదుతుండడం అక్కడి పరిస్థితిని కళ్లకు కడుతోంది. ఇంకోచోట ఓ కుటుంబాన్ని బందీగా చేసుకుని వారి 18 ఏళ్ల కుమార్తెను హత్యచేసిన వీడియో కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. హమాస్ ఉగ్రవాదులే ఈ వీడియోలను షేర్ చేస్తున్నారు. ఇక, వారివద్ద బందీలుగా ఉన్న వారిలో 11 మంది థాయ్‌లాండ్, 17మంది నేపాలీలు కూడా ఉన్నారు. కాగా, ఇజ్రాయెల్ వద్ద 5,200 మంది పాలస్తీనియన్లు బందీలుగా ఉన్నట్టు తెలుస్తోంది. వారిని విడిపించుకునేందుకే హమాస్ ఉగ్రవాదులు యువతులను టార్గెట్‌గా చేసుకుని వారిని చెరబడుతున్నట్టు చెబుతున్నారు.