క్రికెట్ అభిమాని, ప్రాంక్‌స్టర్ జార్వోపై ఐసీసీ నిషేధం!
- ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్‌లో అడ్డంకులు సృష్టించేందుకు ట్రై చేసిన జార్వో
- మైదానంలోకి దూసుకొచ్చేందుకు ప్రయత్నం, అడ్డుకున్న సిబ్బంది
- తదుపరి వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లకు రాకూడదంటూ జార్వోపై ఐసీసీ నిషేధం
డేనియెల్ జార్విస్.. క్రికెట్ ప్రపంచానికి ఈ పేరు సుపరిచితం. జార్వోగా ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్. ప్రాంక్ పేరిట మ్యాచ్ జరుగుతుండగా మైదానంలోకి వెళ్లి నానా యాగీ చేయడం జార్వోకు అలవాటు. ఇప్పటికే ఎన్నో సార్లు ఈ చర్యకు పాల్పడ్డ జార్వో తాజాగా ఆస్ట్రేలియా-ఇండియా మ్యాచ్‌లోనూ ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేశాడు. దీంతో ఐసీసీ తదుపరి జరిగే ప్రపంచకప్ మ్యాచ్‌లకు అతను హాజరు కాకూడదంటూ నిషేధం విధించింది. చెన్నై వేదికగా భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతుండగా పిచ్‌పైకి వచ్చేందుకు ప్రయత్నించిన జార్వోను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు.
ఐసీసీ ప్రపంచకప్‌కు సంబంధించి వ్యక్తుల భద్రతకు తాము అమిత ప్రాధాన్యం ఇస్తామని ఐసీసీ ఈ సందర్భంగా పేర్కొంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా స్థానిక అధికారులతో కలిసి చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ప్రస్తుతం ఈ అంశం భారతీయ అధికారుల పరిధిలో ఉన్నట్టు వెల్లడించింది.