బిగ్ బాస్ ఇంట్లోకి ఐదుగురు కొత్త కంటెస్టెంట్ల ఎంట్రీ

  • బిగ్ బాస్ సీజన్-7లో ఆసక్తికర పరిణామం
  • బిగ్ బాస్ హౌస్ లో 'కొత్త' సందడి
  • ఇవాళ శుభశ్రీ ఎలిమినేషన్
తెలుగు బిగ్ బాస్ సీజన్-7 ఉల్టా పుల్టా అని ముందే ప్రకటించినట్టుగా, అన్నీ చిత్రవిచిత్రంగా జరుగుతున్నాయి. సగం సీజన్ ముగిశాక ఒకేసారి ఐదుగురు కొత్త కంటెస్టెంట్లను బిగ్ బాస్ ఇంట్లోకి పంపించారు. ఇవాళ హౌస్ నుంచి శుభశ్రీ ఎలిమినేట్ కాగా, గౌతమ్ కృష్ణను సీక్రెట్ రూంకు పంపించారు.

అనంతరం టీవీ సీరియల్ నటుడు అర్జున్, నటి అశ్విని, సంగీత దర్శకుడు భోలే షావలి, గుండమ్మ కథ సీరియల్ ఫేమ్ పూజ, టీవీ నటి నయని పావనిలను బిగ్ బాస్ ఇంట్లోకి పంపించారు. దాంతో బిగ్ బాస్ ఇంట్లో మళ్లీ సందడి వాతావరణం నెలకొంది. 

ఇక, నేటి బిగ్ బాస్ ఎపిసోడ్ కు మాస్ మహారాజా రవితేజ హాజరుకావడం కంటెస్టెంట్లకు కొత్త ఎనర్జీని అందించింది. రవితేజ తనదైన శైలిలో అందరినీ అలరించారు. ఈ ఎపిసోడ్ లో రవితేజతో పాటు టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో నటించిన నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ కూడా పాల్గొన్నారు.


More Telugu News