ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్... 2 పరుగులకు ముగ్గురు డకౌట్
- చెన్నైలో భారత్ వర్సెస్ ఆసీస్
- మొదట 49.3 ఓవర్లలో 199 పరుగులకు ఆసీస్ ఆలౌట్
- లక్ష్యఛేదనలో 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్
- భారత టాపార్డర్ ను వణికించిన హేజెల్ వుడ్, స్టార్క్
చెన్నైలో ఆసీస్ తో జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. 200 పరుగుల లక్ష్యమే కదా... ఎంతో సులువు అని భావించి... ఛేదనకు బరిలో దిగిన టీమిండియాకు ఆరంభంలోనే దిమ్మదిరిగిపోయింది. కేవలం 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, రోహిత్ శర్మ ముగ్గురూ డకౌట్ అయ్యారు.
తొలి ఓవర్లోనే మిచెల్ స్టార్క్ ఓ అద్భుతమైన అవుట్ స్వింగర్ తో ఇషాన్ కిషన్ ను బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత ఓవర్లో హేజెల్ వుడ్ రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ ల వికెట్లు తీసి టీమిండియాకు దిగ్భ్రాంతి కలిగించాడు. ముగ్గురు టాప్ బ్యాట్స్ మెన్ ఒక్క పరుగు చేయకుండా వెనుదిరగడంతో మైదానంలో ఒక్కసారిగా నిశ్శబ్దం నెలకొంది.
ప్రస్తుతం టీమిండియా 4 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లకు 10 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ (4 బ్యాటింగ్), కేఎల్ రాహుల్ (4 బ్యాటింగ్) ఉన్నారు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49.3 ఓవర్లలో 199 పరుగులకు కుప్పకూలిన సంగతి తెలిసిందే.