'వరల్డ్ కప్' లో సచిన్, డివిలియర్స్ ల రికార్డును బద్దలు కొట్టిన వార్నర్

  • వరల్డ్ కప్ లో వేగంగా 1000 పరుగుల మార్కు చేరుకున్న వార్నర్
  • 20 ఇన్నింగ్స్ లలో 1000 పరుగులు చేసిన సచిన్, డివిలియర్స్
  • 19 ఇన్నింగ్స్ లలోనే ఈ ఘనత అందుకున్న వార్నర్
ఆసీస్ డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ వరల్డ్ కప్ రికార్డును సొంతం చేసుకున్నాడు. వరల్డ్ కప్ ల్లో వేగంగా 1000 పరుగులు సాధించిన ఆటగాడిగా గతంలో సచిన్ టెండూల్కర్, ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న రికార్డును వార్నర్ బద్దలు కొట్టాడు. ఇవాళ చెన్నైలో టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్ లో వార్నర్ ఈ ఘనత అందుకున్నాడు. 

సచిన్, డివిలియర్స్ వరల్డ్ కప్ లలో 1000 పరుగుల మార్కును 20 ఇన్నింగ్స్ లలో అందుకున్నారు. అయితే, వార్నర్ 19 ఇన్నింగ్స్ లలోనే వెయ్యి పరుగులు సాధించాడు. ఇక, సౌరవ్ గంగూలీ, వివియన్ రిచర్డ్స్ లు 21 ఇన్నింగ్స్ లలో ఈ ఫీట్ నమోదు చేశారు. మార్క్ వా, హెర్షెలే గిబ్స్ లకు వరల్డ్ కప్ లలో వెయ్యి పరుగులు పూర్తి చేసేందుకు 22 ఇన్నింగ్స్ లు అవసరమయ్యాయి. 

డేవిడ్ వార్నర్ తొలిసారిగా 2015లో వరల్డ్ కప్ ఆడాడు. ఆ టోర్నీకి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యమివ్వగా, ఆస్ట్రేలియానే విజేతగా నిలిచింది. సొంతగడ్డపై జరిగిన ఆ వరల్డ్ కప్ లో వార్నర్ 8 మ్యాచ్ ల్లో 345 పరుగులు చేసి ఆసీస్ చాంపియన్ గా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు.


More Telugu News