అసలేమిటీ ఐరన్ డోమ్.. ఎలా పనిచేస్తుంది..? వీడియో ఇదిగో!
- గాజాతో నిరంతర సంఘర్షణల నేపథ్యంలో ఏర్పాటు చేసుకున్న ఇజ్రాయెల్
- ఆకాశంలో దూసుకొచ్చే రాకెట్లను మధ్యలోనే పేల్చేస్తుందంటున్న నిపుణులు
- తక్కువ ఎత్తులో నుంచి దూసుకొచ్చే వాటిని సమర్ధవంతంగా అడ్డుకుంటుందని వివరణ
ఇజ్రాయెల్ పై హమాస్ మిలిటెంట్లు ప్రయోగించిన రాకెట్లలో చాలా వాటిని ఐరన్ డోమ్ అడ్డుకుంది. కేవలం 22 నిమిషాల వ్యవధిలో 5 వేలకు పైగా రాకెట్లు ప్రయోగించగా.. అందులో మెజారిటీ రాకెట్లను ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ అడ్డుకుంది. లేదంటే ఇజ్రాయెల్ భూభాగంలో పెను విధ్వంసం జరిగి ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఏమిటీ ఐరన్ డోమ్.. ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం.
హమాస్ మిలిటెంట్ల పాలనలోని గాజా స్ట్రిప్ నుంచి నిరంతరం సంఘర్షణ ఎదురవడంతో ఇజ్రాయెల్ ఏర్పాటు చేసుకున్న యాంటీ మిసైల్ సిస్టమే ఈ ఐరన్ డోమ్.. ఆకాశంలో నుంచి దూసుకొచ్చే రాకెట్లు, ఇతరత్రా క్షిపణులను చాలా ముందుగానే గుర్తించి, వాటిని మధ్యలోనే కూల్చేసేలా ఈ వ్యవస్థను తయారు చేశారు. ఇజ్రాయెల్ కు చెందిన రాఫెల్ అడ్వాన్స్ డ్ డిఫెన్స్ సిస్టం, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా ఈ వ్యవస్థను అభివృద్ధి చేశాయి.
ఇదెలా పనిచేస్తుందంటే..
ఐరన్ డోమ్ వ్యవస్థలో మూడు కాంపొనెంట్స్ ఉంటాయి. అవి.. రాడార్, కమాండ్ కంట్రోల్ సిస్టం, ఇంటర్ సెప్టార్
అన్నింటినీ అడ్డుకుని పేల్చేయదు..
ఈ ఐరన్ డోమ్ వ్యవస్థలో అతి కీలకమైన విషయం ఏమిటంటే.. శత్రువులు ప్రయోగించిన రాకెట్ లక్ష్యాన్ని అంచనా వేయడం మాత్రమే కాదు సదరు రాకెట్ తన టార్గెట్ ను చేరగలదా లేదా అనేది కూడా క్షణాలలో లెక్కలేస్తుంది. ఆ టార్గెట్ లో పౌరులు కానీ, కీలకమైన భవనాలు కానీ ఉంటే వెంటనే ప్రతిస్పందిస్తుంది. ఎదురుదాడి చేసి ఆ రాకెట్ ను మధ్యలోనే కూల్చేస్తుంది. అలా కాకుండా శత్రువుల రాకెట్ ఎంచుకున్న టార్గెట్ చేరినప్పటికీ ఇజ్రాయెల్ కు పెద్దగా నష్టం లేదని తేలితే ఎదురుదాడి చేయదు. అంటే శత్రువుల రాకెట్ ను ఉద్దేశపూర్వకంగానే వదిలేస్తుంది. దీనివల్ల ఆయుధ నష్టాన్ని నివారిస్తుంది.

- ఇజ్రాయెల్ భూభాగంవైపు దూసుకొచ్చే రాకెట్లను రాడార్ సాయంతో గుర్తించడం మొదటి లెవల్ లో జరుగుతుంది.
- సదరు రాకెట్ పయనించే మార్గాన్ని పరిశీలించి దాని టార్గెట్ ను గుర్తించడంతో పాటు అడ్డుకునేందుకు కమాండ్ కంట్రోల్ సిస్థం ఉపయోగపడుతుంది.
- కమాండ్ కంట్రోల్ సూచనలతో రాకెట్ పై ఎదురుదాడి చేసేందుకు ఇంటర్ సెప్టర్ పనిచేస్తుంది.