ప్రేమతోనే అలా చేశా, మరో ఉద్దేశం లేదు: హోం మంత్రి మహమూద్ అలీ
- గన్‌మెన్ చెంప ఛెళ్లుమనిపించడంపై హోం మంత్రి వివరణ
- గన్‌మెన్ తన కొడుకు లాంటి వాడని వ్యాఖ్య
- అతడి విషయంలో తనకు మరో ఉద్దేశం లేని స్పష్టీకరణ
- తాను అందరినీ గౌరవించే వ్యక్తినని వివరణ
గన్‌మెన్‌పై తను చేయిచేసుకున్న ఘటన వివాదాస్పదం కావడంతో తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ స్పందించారు. ఆ గన్‌మెన్ తనకు కుమారుడి లాంటి వాడని, ఏదో ప్రేమతో అలా చేశానే తప్ప అతడిని కొట్టాలన్న ఉద్దేశం తనకు లేదని వివరణ ఇచ్చారు. తాను అందరినీ గౌరవిస్తానన్నారు. మలక్‌పేటలోని మహబూబ్ గంజ్‌లోగల మార్కెట్ యార్డులో రూ.53 లక్షల విలువైన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గన్‌మెన్ ఘటనపై స్పందించారు.
ఇటీవల మలక్‌పేటలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో సీఎం బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హోం మంత్రి సహా పలువురు తెలంగాణ మంత్రులు హాజరయ్యారు. అయితే ఆ రోజు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదినం కావడంతో హోం మంత్రి మహమూద్ అలీ ఆయనను ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో పూల బొకే కోసం సిబ్బంది వైపు తిరగ్గా తమకు ఈ విషయం గురించి తెలియదని వారు సమాధానమిచ్చారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన మహమూద్ అలీ ఓ గన్‌మెన్ చెంప ఛెళ్లుమనిపించారు. ఘటనకు సంబంధించి వీడియో వైరల్ కావడంతో ఇది వివాదానికి దారి తీసింది.