ఏపీలో ప్రజల రోగాలకు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు ఆ ఒక్కటే కారణమన్న పీతల సుజాత!
- జగనన్న సురక్ష పథకం కాదని, ప్రజలను శిక్షించే పథకమన్న మాజీ మంత్రి
- జగన్ ప్రభుత్వం వైద్యరంగాన్ని అన్ని విధాలా భ్రష్టు పట్టించిందని ఆరోపణ
- ప్రజల అనారోగ్యానికి నాసిరకం మద్యమే కారణమన్న పీతల సుజాత
అవినీతితో కుళ్లిపోతూ, రాజకీయ కక్షతో రగిలిపోతున్న వైసీపీ నేతలకు, ముఖ్యమంత్రికి సురక్ష పథకం అవసరమని మాజీ మంత్రి, టీడీపీ నేత పీతల సుజాత ఎద్దేవా చేశారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది జగనన్న సురక్ష పథకం కాదని, అది ప్రజలను శిక్షించే కార్యక్రమమని విమర్శించారు. జగన్ ప్రభుత్వం వైద్యరంగాన్ని అన్ని విధాలా భ్రష్టుపట్టించిందన్నారు. ఓ వైపు ప్రజలకు నాసిరకం మద్యాన్ని అందిస్తూ, మరోవైపు సురక్ష అంటూ ప్రచార ఆర్భాటానికి తెరదీశారన్నారు.
సురక్ష కార్యక్రమంలో విధులు నిర్వర్తించే ఆశా వర్కర్లను, వైద్య ఆరోగ్య సిబ్బందిని కాపాడలేని ముఖ్యమంత్రి ఇక ప్రజలను రక్షిస్తారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలు రోగాలపాలవ్వడానికి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడటానికి జగన్ అధికారంలోకి వచ్చాక అందుబాటులోకి తెచ్చిన నాసిరకం మద్యమే కారణమని ఆరోపించారు.