తెలంగాణ విషయంలో కాంగ్రెస్ నేత చిదంబరం కీలక వ్యాఖ్యలు
- తెలంగాణ ఏర్పడగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెంది ఉండేదన్న చిదంబరం
- మోదీ వచ్చి కేసీఆర్‌ను తిడతారు, కేసీఆర్ వెళ్లి మోదీని తిడతారన్న కాంగ్రెస్ నేత
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజా సమస్యలు పట్టడం లేదని ఆరోపణ
తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ రాష్ట్రం మరింత అభివృద్ధి చెంది ఉండేదన్నారు. హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న చిదంబరం ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజా సమస్యలు పట్టడం లేదని ఆరోపించారు. తెలంగాణకు వచ్చి మోదీ.. సీఎం కేసీఆర్‌ను తిడతారని, కేసీఆర్ తెలంగాణ మొత్తం తిరిగి మోదీని తిడతారని, కానీ వీరెవరూ తెలంగాణ ప్రజల సమస్యలపై మాట్లాడరని విమర్శించారు. అన్ని రంగాల్లో తెలంగాణ ఆశించిన దాని కంటే వెనుకబడిందన్నారు.