ఇజ్రాయెల్‌పై హమాస్ రాకెట్లతో దాడి, భారత పౌరులకు అడ్వైజరీ

  • ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్ల మెరుపు దాడి
  • భారత పౌరులకు అడ్వైజరీ జారీ చేసిన ఎంబసీ
  • అప్రమత్తంగా ఉండాలని సూచన
  • స్థానిక అధికారులు సూచించిన భద్రతాపరమైన ప్రోటోకాల్ పాటించాలని వెల్లడి
హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేశారు. దీంతో ఇజ్రాయెల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి భారత పౌరులకు భారత ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయెల్‌లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక అధికారులు సూచించిన భద్రతాపరమైన ప్రోటోకాల్ పాటించాలని సూచించింది. అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని తెలిపింది. సురక్షిత శిబిరాలకు చేరువగా ఉండాలని పేర్కొంది. అత్యవసర పరిస్థితులు ఎదురైతే భారత ఎంబసీలో సంప్రదించాలని సూచించింది.

గాజాలోని హమాస్ మిలెటెంట్లు శనివారం ఉదయం ఇజ్రాయెల్‌పై మెరుపుదాడికి దిగిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ పైకి వేలాది రాకెట్లను ప్రయోగించారు. భూభాగంలోకి చొచ్చుకు వెళ్లారు. వీరిని ఇజ్రాయెల్ సైన్యం ప్రతిఘటిస్తోంది. గాజాలోని హమాస్ స్థావరాలపై వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది.


More Telugu News