పిల్లలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసే స్థాయికి దిగజారారు: కేసీఆర్ కు రేవంత్ లేఖ

  • మధ్యాహ్న భోజన పథకంలో పలు సమస్యలు ఉన్నాయన్న రేవంత్
  • సీఎం బ్రేక్ ఫాస్ట్ అంటూ హడావుడి చేస్తున్నారని మండిపాటు
  • పాఠశాలల్లో వంట గదులు సక్రమంగా లేవని విమర్శ
సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని విమర్శిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ఇప్పటికే పలు సమస్యలతో మధ్యాహ్న భోజన పథకం విమర్శలపాలు అవుతుంటే... వాటిని పట్టించుకోకుండా సీఎం బ్రేక్ ఫాస్ట్ అంటూ హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. చివరకు పిల్లలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసే స్థాయికి దిగజారారని వివర్శించారు. చాలా పాఠశాలల్లో వంట గదులే సక్రమంగా లేవని అన్నారు. చెట్ల కింద వంటలు వండుతున్న పరిస్థితి ఉందని... దీనివల్ల మధ్యాహ్న భోజనం కలుషితమై పిల్లలు అనారోగ్యానికి గురైన సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పారు. 

రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, పాఠశాలల నిర్వహణ అధ్వానంగా ఉందని రేవంత్ అన్నారు. ఈ దారుణ పరిస్థితులపై మీరు ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించలేదని దుయ్యబట్టారు. మధ్యాహ్న భోజన పథకంలోని సమస్యలతో పాటు, కార్మికుల డిమాండ్లను కూడా పరిష్కరించాలని కోరారు.


More Telugu News