కెనడాలో కూలిన శిక్షణ విమానం, ఇద్దరు భారతీయ ట్రైనీ పైలట్ల మృతి
- బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో కూలిన విమానం
- ముంబైకి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరి మృతి
- ప్రమాద ఘటనపై విచారణ జరుపుతోన్న సేఫ్టీ బోర్డు
కెనడాలో ఓ శిక్షణ విమానం కూలిన ఘటనలో ఇద్దరు భారతీయులు మృతి చెందారు. బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లోని చిల్లివాక్ సిటీ విమానాశ్రయానికి సమీపంలో ఈ శిక్షణ విమానం కూలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, ఇందులో ఇద్దరు భారతీయ ట్రెయినీ పైలట్లు ఉన్నారు. శిక్షణలో ఉన్న హైపర్ పీఏ-4 సెనెకా లైట్ వెయిట్ ఎయిర్ క్రాఫ్ట్ శనివారం హఠాత్తుగా పొదల్లోకి దూసుకెళ్లింది.
ఈ ఘటనలో ముంబైకి చెందిన అభయ్ గద్రూ, యశ్ విజయ్ మృతి చెందినట్లు మీడియాలో వచ్చింది. వీరిద్దరు ఒకే కుటుంబానికి చెందినవారుగా చెబుతున్నారు. ఈ ఘటనలో ఈ ముగ్గురు పైలట్లకు మినహా ఎవరికీ ఏమీ కాలేదు. విమానం కూలిన ఘటనపై కెనడా ట్రాన్సుపోర్టేషన్ సేఫ్టీ బోర్డు విచారణ జరుపుతోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.