ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్.. రూ.15 వేల లోపు 5జీ ఫోన్లు

  • 8వ తేదీ నుంచి మొదలు కానున్న సేల్స్
  • ప్లస్ సభ్యులకు నేటి నుంచే సేల్స్ లైవ్
  • క్రెడిట్ కార్డులపై 10 శాతం అదనపు డిస్కౌంట్
ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ కార్యక్రమం ఈ నెల 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరగనుంది. ఫ్లిప్ కార్ట్ ప్లస్ సభ్యులకు ఈ డిస్కౌంట్ సేల్ శనివారం (7వ తేదీ) నుంచే ప్రారంభమైంది. స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయాలని అనుకునే వారు ఈ తరుణంలో 5జీ ఫోన్లను తీసుకోవడమే బెటర్, ఎందుకంటే మరో ఏడాదిలో 5జీ దేశవ్యాప్తంగా కవరేజీలోకి వస్తుంది. ఫ్లిప్ కార్ట్ లో రూ.15వేల లోపు 5జీ ఫోన్ల డీల్స్ ను పరిశీలించినట్టయితే..

ఇన్ఫినిక్స్ హాట్ 30 5జీ
ఈ ఏడాది జులైలో విడుదలైంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్ సెట్ తో, 4జీ ర్యామ్, 8జీబీ ర్యామ్ వేరియంట్ గా వస్తుంది. స్టోరేజీ మాత్రం 128జీబీగా ఉంటుంది. 6.78 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే, 120 హెర్జ్ రీఫ్రెష్ రేట్, వెనుక రెండు కెమెరాలతో ఉంటుంది. డిస్కౌంట్ తో రూ.11,499 ధరకు అమ్మకానికి వచ్చింది. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్ కార్డులపై 10 శాతం అదనపు డిస్కౌంట్ పొందొచ్చు.

రియల్ మీ 11ఎక్స్ 5జీ
ఈ ఫోన్ ఈ ఏడాది ఆగస్ట్ లో విడుదలైంది. 6.72 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ అమోలెడ్ డిస్ ప్లే, 120 హెర్జ్ రీఫ్రెష్ రేటు, మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ఎస్ వోసీతో వస్తుంది. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ధర రూ.12,999. క్రెడిట్ కార్డులపై రూ.1,000 తగ్గుతుంది.

ఇన్ఫినిక్స్ నోట్ 30 5జీ
ఈ ఏడాది జూన్ లో విడుదలైంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్ సెట్ తో వస్తుంది. 6.78 అంగుళాల ఫుల్ హెడ్ డీ ప్లస్ ఐపీఎస్ డిస్ ప్లే, 120 హెర్జ్ రీఫ్రెష్ రేటుతో వస్తుంది. 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ధర రూ.13,499. క్రెడిట్ కార్డులపై మరో 10 శాతం తగ్గుతుంది.

రెడ్ మీ నోట్ 12 5జీ
ఈ ఏడాది జనవరిలో లాంచ్ అయింది. 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ అమోలెడ్ డిస్ ప్లే, 120 హెర్జ్ రీఫ్రెష్ రేటు, స్నాప్ డ్రాగన్ 4 జనరేషన్ 1 చిప్ సెట్, వెనుక భాగంలో 48 మెగాపిక్సల్ తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటాయి. 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ధర రూ.15,999. బ్యాంక్ కార్డులపై 10 శాతం అదనపు డిస్కౌంట్ పొందొచ్చు.

శామ్ సంగ్ గెలాక్సీ ఎఫ్ 34 5జీ
ఇది ఈ ఏడాది ఆగస్ట్ లో విడుదలైన ఫోన్. 6.46 అంగుళాల ఫోన్, సూపర్ అమోలెడ్ డిస్ ప్లే, వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. శామ్ సంగ్ కు చెందిన ఎక్సినోస్ 1280 చిప్ సెట్ తో ఉంటుంది. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ధర మామూలు రోజుల్లో రూ.18,999గా ఉండేది. ఇప్పుడు రూ.16,499కి అందుబాటులోకి వచ్చింది. కార్డులపై చెల్లింపులతో రూ.1,500 అదనపు డిస్కౌంట్ పొందొచ్చు.

పోకో ఎక్స్5 5జీ
ఇది మార్చిలో విడుదలైంది. ఆరంభంలో 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ ధర రూ.20,999. కానీ, ఇప్పుడు రూ.14,999కే విక్రయానికి వచ్చింది. బ్యాంక్ కార్డులపై మరో 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. 6.67 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే, 120 హెర్జ్ రీఫ్రెష్ రేటు, వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా, స్నాప్ డ్రాగన్ 695 ఎస్ వోసీ ఉన్నాయి. 

మోటోరోలా జీ54 5జీ
ఇటీవలే విడుదలైన మోటోరోలా జీ54 5జీ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్ సెట్ తో వస్తుంది. వెనుక భాగంలో 50 మెగాపిక్సల్ ప్రధాన కెమెరాతో కూడిన డ్యుయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ ధర రూ.15,999. కార్డులపై 10 శాతం అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.


More Telugu News